మావోయిస్టు నాయకుడు రూపాశ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన
శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని దేశంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటుంది. మా పార్టీ కేంద్ర కమిటీ కూడా శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నట్టు ఇప్పటికే లేఖలు జారీ చేసింది. చర్చల పట్ల మా నిబద్దతను చాటడానికి మేము నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ప్రభుత్వ ఉద్దేశ్యం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం అణచివేత, హింసను ఉపయోగిస్తున్నది. దీని కొనసాగింపుగానే , బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ప్రభుత్వం ఒక పెద్ద సైనిక ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని, ఆ ప్రాంతం నుండి బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించాలని, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని మేము ప్రభుత్వాన్నికోరుతున్నాము. ఈ మార్గం మాత్రమే సానుకూల ఫలితాలను ఇస్తాయి. తుపాకుల బలంతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న సైనిక ఆపరేషన్‌ను నిలిపివేయాలన్న మా డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూల ప్రతిస్పందన కోసం మేము వేచి చూస్తాము.
రూపేష్
అధికార ప్రతినిధి
నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)


కన్నబిడ్డల జ్ఞాపకాలు నిలుపుకోవడమూ నేరమా? రాకేశ్ స్థూపాన్ని కూల్చేసిన పోలీసులు
వార్ టూరిజం : జాఫ్నా టూ బస్తర్ – ముసాఫిర్
చివరి రక్తం బొట్టు వరకు విప్లవ పంథా కోసం నిలబడ్డ యోధుడు కామ్రేడ్ రాజు దాదా
విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు కామ్రేడ్ రాజు దాదా
తెలంగాణలో ఉద్యమకారులకు NIA నోటీసులు
మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి-కూనంనేని డిమాండ్ 