Menu

మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి-కూనంనేని డిమాండ్

anadmin 6 hours ago 0 22

తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి @ దేవ్ జీ, పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్ తో సహా పలువురు మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

మార్చ్ 31 కల్లా దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించిన కేంద్రప్రభుత్వం దండకారణ్యంలో రక్తపాతం సృష్టిస్తోంది. ఇప్పటికే వందలాది మంది ఆదివాసులను, వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ నాయకులను హత్యలు చేస్తున్నది. మరో వైపు లొంగిపోకపోతే చంపేస్తామంటూ అమిత్ షా రాజ్యాంగ విరుద్దమైన హెచ్చరికలు జారీచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అరెస్టైనవారితో బలవంతపు లొంగుబాట్లు ప్రకటనలు ఇప్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంతో పోటీపడుతూ లొంగుబాట్ల ప్రహసనం కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి @ దేవ్ జీ, పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్ తో సహా పలువురు మావోయిస్టు నాయకులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. వారిని చట్ట ప్రకారం కోర్టులో హాజరుపర్చకుండా లొంగుబాటు ప్రకటించాలని వారిపై వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మావోయిస్టు నాయకులందరినీ వెంటనే కోర్టులో హాజరుపర్చాలని కూనంనేని డిమాండ్ చేశారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad