Menu

ఉస్మానియా, HCU విద్యార్థుల పోరాటాలకు మద్దతు ప్రకటించిన మావోయిస్టు పార్టీ

anadmin 1 year ago 0 229

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ జారీ చేసిన నిరంకుశ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఓయూ విద్యార్థులకు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని పరైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నHCU విద్యార్థులకు మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన‌ ప్రకటన పూర్తి పాఠం…

*ఉస్మానియా యూనివర్శిటీలో ప్రభుత్వం విధించిన నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి!

*ప్రజా వ్యతిరేక, దళారీ నిరంకుశ‌ (కార్పోరేట్) అనుకూల నిషేధపు ఆంక్షలను ఎత్తిచేసే వరకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడండి!!

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 13వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ ద్వారా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. యూనివర్సిటీలో అభ్యుదయ, విప్లవ చైతన్యం కలిగి ఉన్న విద్యార్థుల పోరాటాలను అణిచివేయడానికి విద్యార్థుల ఆందోళనలను, ధర్నాలను నిషేధించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య‌ రాజ్యాంగ విరుద్ధం. అప్రజాస్వామికం. ఇలాంటి నిరంకుశత్వ చర్యలు దేశ బవిష్యత్తును నాశనం చేస్తాయి. ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల (దళారీ నిరంకుశ బూర్జువా వర్గం)కోస‍ం విద్యను ప్రవేటుపరం చేయడం, యూనవర్సిటీ భూములను కార్పోరేట్లకు అప్పచెప్పడానికి అమ్మడానికి పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే యూనివర్శిటీలో ఘోరమైన నిరంకుశ పాలన కొనసాగుతుంది. 32వ రాజ్యంగా చట్ట సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించిన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధతను పట్టించి కోకుండా. 400 ఎకరాలను అమ్మకానికి పెడుతున్నారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారు. నియంతృత్వ విధానాలను అమలు చేస్తూ కనీస పౌర స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నటికంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.

యూనివర్సిటీ విద్యార్థులు నిజాం ప్రభుత్వం మొదలు నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వరకు వ్యతిరేకిస్తూ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్నారు. కేవలం విద్యార్థుల సమస్యలకే పరిమితం కాలేదు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి అనేక త్యాగాలు చేసారు. నేడు చాలా మంది అనుభవిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక ఫలితాలన్నీ విద్యార్థులు చేసిన విరోచిత పోరాటాల ఫలితమే. కానీ నేడు దోపిడీ పాలక వర్గాలు మాత్రం దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకొన్నాయి. అందులో భాగంగానే యూనివర్సిటీలో కొనసాగుతున్న ప్రజావోద్యమాలపై అణిచివేత ఆంక్షలను విధించాయి.

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. ప్రజా వ్యతిరేక, దళారీ నిరంకుశ బూర్జువా(కార్పోరేట్) అనుకూల నిషేధపు ఆంక్షలను ఎత్తిచేసే వరకు విద్యార్థులంతా ఐకంగా ఉద్యమించండి.

జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ ( మావోయిస్టు)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad