Menu

మూలవాసి బచావో మంచ్ కార్యకర్త గంగను వెంటనే విడుదల చేయాలి ‍-CLC డిమాండ్

anadmin 1 year ago 0 104

మూలవాసి బచావో మంచ్ కార్యకర్త గంగను బీజాపూర్ జిల్లా పామేడు లో పోలీసులు నిన్న 8:00 గంటలకు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తేది 18-10-2024 సాయంత్రం మాద్వి గంగిని పామేడ్ లో పోలీసులు పట్టుకోవటం జరిగింది. అక్కడ పనిచేస్తున్న వృద్ధాప్య సంస్థలో మాద్వి గంగ‌ టీచర్ గా పని చేస్తుంది. ఆ సంస్థ తరుపున జిలేర్ గండ గ్రామంలో పిల్లలకు చదువు చెప్పే గంగి అవసరమైన సామాను తీసుకురావటానికి పామేడ్ వెళ్లగా అక్కడ పోలీసులు పట్టుకున్నారు. బీజాపూర్ జిల్లా కేత్వలి పోలీస్ స్టేషన్ నుండి తీసుకొని వచ్చారు, అక్కడ గంగి ని పోలీసులు విచారిస్తున్నారు. మాద్వి గంగి స్వంత గ్రామము పాలగూడ, గ్రామ పంచాయితీ పాలగూడ, తాలూకా పామేడు, జిల్లా బీజాపూర్.
మాద్వీ గంగి ని పామేడు పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చూపించకపోవడం తో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అవుతున్నారు చతిస్ షుడ్ రాష్ట్రం బీజాపూర్ కు చెందిన గంగ , గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసుల హక్కుల కోసం మూలవాసి బచావో మంచ్ లో పనిచేస్తుంది . అమెకుఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆమెపై కేసులు లేకుంటే బేషరతుగా విడుదల చేయాలని .పౌర హక్కుల సంఘం తెలంగాణ, ఏపీ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి.ది .

ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్
రాష్ట్ర అధ్యక్షుడు
పౌర హక్కుల సంఘం తెలంగాణ .
ఎన్ నారాయణరావు
ప్రధాన కార్యదర్శి
పౌర హక్కుల సంఘం
తెలంగాణ .

వేదంగి చిట్టిబాబు,
\రాష్ట్ర అధ్యక్షుడు,
చిలుకాచంద్రశేఖర్,
ప్రధాన కార్యదర్శి
పౌరహక్కుల సంఘం,
ఆంధ్రప్రదేశ్.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad