వారిలో కామ్రేడ్ వివేక్ సీపీఐ (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు. ఆదివాసీ నేపథ్యం నుండి వచ్చిన కామ్రేడ్ ప్రయాగ్ మాంఝి @ వివేక్ ఐదు దశాబ్దాల క్రితం బాల సంఘం సభ్యుడిగా ఉద్యమంలో చేరారు. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన బొకారో, గిరిఢీ, జముయి, జార్ఖండ్‌లోని ఇతర ప్రాంతాలలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. జల్, జంగల్, జమీన్, ఆత్మగౌరవాల కోసం, ఆదివాసీల హక్కుల కోసం తమ ప్రాణాలను అర్పించిన తిలకా మాంఝీ, సిద్ధు, కానో, బిర్సా ముండా తదితర గొప్ప సంథాలి, ముండా నాయకుల పేర్ల మాదిరిగానే జార్ఖండ్‌లోని ఆదివాసీలు ప్రయాగ్ మాంఝి పేరును ఎప్పటికీ తలచుకుంటారు.
కా. వివేక్ , మార్క్సిజాన్ని, సామ్రాజ్యవాదాన్ని అర్థం చేసుకుని నవ సమాజ నిర్మాణానికి పోరాడాడు. పోరాటానికి నాయకత్వం వహించాడు. కార్పొరేట్ మాఫియా జార్ఖండ్ ఖనిజాలను దోచుకోవడానికి వ్యతిరేకంగా ఆయన తన చివరి శ్వాస వరకు పోరాడారు. జార్ఖండ్‌లోని ఆదివాసీలు, దోపిడీకి గురైన ఆదివాసీయేతరుల పోరాటాలను భారతదేశం అంతటా రైతుల, కార్మికుల పోరాటాలతో ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. భారతదేశ నూతన ప్రజాస్వామ్య విప్లవ పోరాటానికి ఆయన గొప్ప నాయకుడు. ఆయన రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తారు. కొన్ని నెలల క్రితం, ఆయన భార్య మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకురాలు చింతా దీ కి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స పొందుతున్నప్పుడు ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇప్పటికీ జైలులోనే ఉంది.
ఖనిజాలను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి నిర్వహిస్తున్న ఈ కగార్ ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేద్దాం.
-రవి నార్ల

ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర
ఏ మార్గాన్ని అనుసరించాలి?
జైలు చీకటి కొట్లలో కేకలేస్తున్న మానవ హక్కులు: యాతనలు, ఆకలి, క్రూరత్వాల భయంకర చిత్రం
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
మీ వేళ్లతో మీ రక్తబంధువుల కళ్లను పొడవకండి – ఆదివాసీ పోలీసులకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
వర్తమాన సంక్షోభం – చారిత్రక ఆశావాదం 