Menu

తలోజా జైల్లో సురేంద్ర గాడ్లింగ్, దినకర్ గోటా నిరాహార దీక్ష‌

anadmin 3 hours ago 0 11

భీమా కోరేగావ్-ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, గడ్చిరోలి దాడి కేసులో నిందితుడైన దినకర్ గోటా – తలోజా సెంట్రల్ జైలులో ఉన్న ఈ ఇద్దరు రాజకీయ ఖైదీలు, ఫాదర్ స్టాన్ స్వామి ఐదవ వర్ధంతి సందర్భంగా 2026 జూలై 5న ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఈ మేరకు తలోజా జైలు నుండి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు.

”అధికారంలో ఉన్నవారికి తలొగ్గడానికి నిరాకరించి, తన చివరి శ్వాస వరకు ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం దృఢంగా నిలబడినందునే ఫాదర్ స్టాన్ స్వామి వ్యవస్థాగత హత్యకు (institutional murder) గురయ్యారు. అన్యాయం, అణచివేత, ప్రజాస్వామ్య హక్కులపై దాడులకు వ్యతిరేకంగా ఆయన నిర్భయంగా గళమెత్తారు. ఆయన మరణానికి కారణమైన వ్యవస్థాగత అణచివేతకు నిరసనగా ఈ ఒక రోజు నిరాహార దీక్ష చేపడుతున్నాము” అని ఆ ప్రకటనలో వారు పేర్కొన్నారు.

న్యాయం, మానవ గౌరవం, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫాదర్ స్టాన్ స్వామి జీవితం, పోరాటం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఆయన త్యాగం వృథా కాకుండా చూసుకోవాలనే సంకల్పంతో ఈ నిరాహార దీక్ష చేపట్టాము. ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయం కోసం ఆకాంక్షించే పౌరులందరూ ఈ విషయంలో తమ సంఘీభావాన్ని తెలపాలని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాము.

ఇట్లు,

సురేంద్ర గాడ్లింగ్
దినకర్ గోటా

తలోజా సెంట్రల్ జైలు,
తలోజా, నవీ ముంబై

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad