Menu

కగార్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ రివల్యూషనరీ స్టూడెంట్-యూత్ మూవ్‌మెంట్ ప్రకటన‌

anadmin 2 years ago 0 111

ఆపరేషన్ కాగర్‌ను వెంటనే ఆపండి!

మోడీ-అదానీ ఫాసిజాన్ని తరిమికొట్టండి!

భారతదేశంలోని ఆదివాసీ ప్రజలపై మారణహోమానికి వ్యతిరేకంగా నిలబడండి!

లాంగ్ లివ్ మార్క్సిజం-లెనినిజం-మావోయిజం!

బంగ్లాదేశ్‌లోని రివల్యూషనరీ స్టూడెంట్-యూత్ మూవ్‌మెంట్ కగార్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నది.
ప్రభుత్వం భారతదేశంలోని అడవులను కార్పొరేటీకరించడం , సైనికీకరించడం లక్ష్యంగా కగార్ ఆపరేషన్ ద్వారా మావోయిస్టుల అణచివేత పేరుతో అమాయక ఆదివాసీ వర్గాల మారణహోమం సృష్టిస్తున్నది.
హిందుత్వ ఫాసిస్ట్ రాజ్యానికి నాయకత్వం వహిస్తున్న‌ క్రూరమైన వర్గాలు ఆపరేషన్ కగార్ పేరుతో మానవ హక్కులను దారుణంగా ఉల్లంఘిస్తున్నారు. ఆపరేషన్ కాగర్ ఆదివాసీ ప్రజలపై దాడి మాత్రమే కాదు; ఇది న్యాయం, సమానత్వం మానవహక్కులపై దాడి. ఈ స్వంత ప్రజలనే లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, రాజ్యం కార్పొరేట్ లాభం కోసం ఈ మారణహోమం సృష్టిస్తోంది.

దీనికి విరుద్ధంగా, మావోయిస్టులు ఆదివాసీలకు సంఘీభావంగా నిలుస్తూ అణగారిన వర్గాల కోసం రాజ్య‌ దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ కాగర్‌కు వ్యతిరేకంగా నిలబడిన వారందరినీ మేము అభినందిస్తున్నాము. మీ
సంఘీభావం అనేది ప్రతిఘటన యొక్క శక్తివంతమైన ప్రకటనగా మేం భావిస్తున్నాం. మిగిలిన ప్రజానీకానికి కూడా ఇందులో చేరాలని పిలుపునిస్తున్నాం

తౌఫిక ప్రియ
అధ్యక్షుడు
విప్లవ విద్యార్థి-యువజన ఉద్యమం (బంగ్లాదేశ్)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad