ఈ నెల 4వ తేదీన చత్తీస్ గడ్ నారాయణపూర్ జిల్లా గోవాడి, బొండోస్-తులాతులి అడవుల్లో భద్రతాబలగాల కాల్పుల్లో 35 మంది మావోయిస్టులు అమరులైనట్టు ఆ పార్టీ ప్రకటించింది. సీపీఐ మావోయిస్ట్ తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ పేరిట విడుదల చేసిన లేఖలో పారా మిలటరీ బలగాలు చేసిన దుర్మార్గాన్ని బహిర్గతం చేసింది.
”ఉదయం 6 గంటలకు రోలింగ్ చేస్తున్నప్పుడు, అన్ని వైపుల నుండి శత్రు దూకుడు గురించి సమాచారం అందింది. వెంటనే సహచరులందరూ తమ తమ కవర్లలో స్థానాలు తీసుకున్నారు. ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు, శిబిరం యొక్క అన్ని దిశలలో ఆకాశంలో డ్రోన్లు తిరిగాయి . 10 గంటలకు సమాచారం కోసం ఒకరిని దగ్గర్లోని గ్రామానికి పంపినప్పుడు, గ్రామానికి వెళ్లే మార్గంలో, శిబిరం చుట్టూ శత్రువులు ఉన్నారని మాకు వార్త వచ్చింది. వెంటనే శిబిరాన్ని ఖాళీ చేసి బయటకు వెళ్లడం ప్రారంభించాం. అక్కడి నుంచి మేము బయలుదేరిన 15 నిమిషాల తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయి. శతృవును ప్రతిఘటిస్తూ అటువైపు వెనుతిరుగుతుండగా అక్కడ కూడా కాల్పులు మొదలయ్యాయి. ఇక్కడ ఓ మహిళా సహచరురాలు గాయపడింది. తమను శత్రువు చుట్టుముట్టినట్లు తెలిసిన వెంటనే శత్రు వలయాన్ని ఛేదించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాము. సహచరులు ధైర్యంగా పోరాడారు. శత్రువులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 8 మంది సహచరులు వీరమరణం పొందారు. (12 మంది సహచరులు గాయపడ్డారు) 15 నిమిషాల ప్రతిఘటన అనంతరం గాయపడిన సహచరులను తీసుకొని వెళ్లిన తర్వాత, నాల్గవసారి మళ్ళీకాల్పులు జరిగాయి. (ఈ కాల్పుల్లో నలుగురు సహచరులు గాయపడ్డారు) అక్కడి నుంచి 30 నిమిషాల దూరం వెళ్లిన తర్వాత శత్రువులు ఎల్ ఫార్మేషన్‌లో కూర్చుని కాల్పులు జరిపారు. ఇక్కడి నుంచి రెండు జట్లు విడిపోయాయి. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన కాల్పులు రాత్రి 9 గంటల వరకు అడపాదడపా 11 సార్లు కొనసాగాయి. అన్ని కాల్పుల్లో మా సహచరులు 14 మంది అమరులయ్యారు. గాయపడిన కదలలేని పరిస్థితుల్లో ఉన్న17 మంది సహచరులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి 5వ తేదీ ఉదయం 8 గంటలకు దారుణంగా హత్య చేశారు.
ఈ శత్రు ముట్టడి దాడి ఫాసిస్ట్ పద్ధతిలో జరిగింది. తూర్పు బస్తర్ డివిజన్ విప్లవాత్మక ఉద్యమాన్ని అంతం చేయడానికి, ఈ ప్రదేశంలోని సహజ ఖనిజ సంపదను భారతీయ, విదేశీ కార్పొరేట్ వర్గాలకు అప్పగించడానికి ఈ మారణహోమం జరిగింది.కేంద్ర రాష్ట్రంలోని పాలక బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విప్లవ అణచివేత సూరజ్‌కుండ్ వ్యూహాత్మక పథకం కింద ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ కాగర్ ఒక భాగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేసేందుకు పేద గిరిజనులపై దాడులు చేస్తున్నాన్నారు. వారు డబ్బు ఆశ చూపి, భయపెట్టి, బెదిరింపుల ద్వారా కొందరిని ఇన్ఫార్మర్లుగా మారుస్తున్నారు. ఈ ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకుని అన్ని వర్గాల ప్రజలు నిరసన తెలపాలి.
అమరవీరులందరినీ స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహించండి. అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ మారణకాండకు, అణచివేతకు వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామిక, ప్రగతిశీల లౌకిక, విప్లవ సామాజిక సంస్థలు గళం విప్పాలి. ఈ ఘటనపై న్యాయ విచారణకు పోరాటం చేయాలి. ఘటనా స్థలాన్ని సందర్శించి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాలని మా ఈస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ ప్రజా సంఘాలకు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తోంది.”
తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)
అమరులైన 35 మంది మావోయిస్టుల వివరాలు కింద ప్రెస్ నోట్ లో ఉన్నవి.




ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర
ఏ మార్గాన్ని అనుసరించాలి?
మహాన్ భూంకాల్ నుంచి మావోయిస్టు విప్లవం దాకా – పాణి
ప్రజలు తీర్చిదిద్దిన యోధుడు – సమిత
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
కగార్‌లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్ 