ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా టేకమెట్ల గ్రామంలో ఈ రోజు (22-10-24) ఉదయం 5.25 గంటలకు గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టి
(1) మహేంద్ర సోడీ S/O శ్రీ మారా 30 సం.లు
(2) రాజ్ కుమార్ సోడి S/O మారా 29 సం.లు
(3) దేవా బడ్సే S/O లఖ్మా 15 సం.లు
(4) ఉర్ర కుంజమ్ S/O అందా 15 సం.లు
(5)రాజు మడ్వి 14 సం.లు
అనే సాధారణ గ్రామీణ యువకుల్ని అరెస్టు చేసి ఉసూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకపోయినట్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఐదుగురు వ్యక్తులను తీసుకపోతున్న సందర్భంలో పోలీసు బలగాలను ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా మహిళలను, గ్రామస్తులను బలగాలు బెదిరింపులకు గురిచేసారు. ఈ ఐదుగురిని పోలీసు బలగాలు అక్రమంగా ఆధీనంలోకి తీసుకోవడంతో వారి ప్రాణాలకు హాని ఉంటుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
పౌర ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ బిజేపి డబల్ ఇంజన్ సర్కార్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఆదివాసుల జీవించే హక్కును హరిస్తూ, అడవిలో ఆదివాసులపై అప్రకటిత ఎమర్జెన్సీని అమలుపరుస్తున్నది.
పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు ఆదివాసి యువకులను వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకమిటీలు డిమాండ్ చేస్తున్నాయి..
ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్
అధ్యక్షుడు
పౌర హక్కుల సంఘం
రాష్ట్ర కమిటీ
తెలంగాణ
ఎన్ నారాయణరావు
ప్రధాన కార్యదర్శి
పౌర హక్కుల సంఘం
రాష్ట్ర కమిటీ
తెలంగాణ
వి.చిట్టిబాబు, అధ్యక్షుడు
చిలుకా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి
పౌర హక్కుల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ

మండుతున్న అడవి – ముసాఫిర్
మీ జ్ఞాపకాలతో జీవిస్తాం…మీ ఆలోచనలతో ముందుకుపోతాం
వార్ టూరిజం : జాఫ్నా టూ బస్తర్ – ముసాఫిర్
మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి-కూనంనేని డిమాండ్
Global Solidarity Call to EndState Militarization and Extrajudicial Killings in Resource-RichAdivasi Regions in India
ప్రజలు తీర్చిదిద్దిన యోధుడు – సమిత 