ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో చత్తీసుఫడ్ రాష్జ్ర సాయిధ రిజర్వుడు పోలీసులు నిన్న ఉదయం 9 గంటలకు అక్రమంగా అదుపులోకి తీసుకున్న ఆరుగురు మూలవాసి బచావో మంచ్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. బీజాపూర్ పోలీసులు పెట్రోలింగ్ సమయంలో అనుమానంతో ఈ అక్రమ నిర్భందానికి పాల్పడినారని,చత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ ప్రాంతంలో పోలీసులు యువకులను సిపిఐ (మావోయిస్టు)ల పేరిట కాల్చి చంపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో యువకుల కుటుంబాలు, పరిసర ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని పౌరహక్కుల సంఘం ఏపీ, తెలంగాణ శాఖలు ఆందోళన వ్యక్తం చేశాయి.
పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న ర్యాలీకి మద్దతుగా ఆరుగురు బచావో మంచ్ కార్యకర్తలు అర్జున్ సోధి, ముయా హేమ్లా, నగేష్ బడ్సే, జోగా మీడియం,గిల్లు కాటం, భీమా కుంజంలు రాత్రి సమయం కావడంతో గుండిర్‌గూడలో పడుకున్నారని, ఆ సమయంలో అక్కదీకి వచ్చిన పోలీసులు వీరిని అక్రమంగా అరెస్టు చేశారని పౌరహక్కుల సంఘం తెలిపింది.ఈ అరెస్టును పోలీసులు ధ్రువీకరించక పోవడంతో పోలీసులు వారిని అదృశ్యం చేశారని కుటుంబసభ్యులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సంఘం పేర్కొంది.

కన్నబిడ్డల జ్ఞాపకాలు నిలుపుకోవడమూ నేరమా? రాకేశ్ స్థూపాన్ని కూల్చేసిన పోలీసులు
వార్ టూరిజం : జాఫ్నా టూ బస్తర్ – ముసాఫిర్
చివరి రక్తం బొట్టు వరకు విప్లవ పంథా కోసం నిలబడ్డ యోధుడు కామ్రేడ్ రాజు దాదా
విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు కామ్రేడ్ రాజు దాదా
అరెస్టును లొంగుబాటుగా చూపించడంలో మర్మమేంటి?
బీజేపీ బాటలో ఆప్… దళితులకు భూమి కోసం పోరాడుతున్న ముకేశ్ మలౌద్ అక్రమ అరెస్ట్ 